సునోరే...
ఓరుగల్లు కోటనడుగు కోటలోని కత్తినడుగు
చెపుతాయిలె ఈ నేలఘనతనే తెలంగాణ చరితనే
గోలుకొండ గోడనడుగు గోడలోని రాయినడుగు
చెపుతాయిలె పానన్న పోరునే పౌరుషపు దాడినే
అదిలబాదు అడవినడుగు కొమురం భీం సాహసమే
మేడారం గద్దెనడుగు కోయ జాతి తెగువనే
పాలపిట్ట పలుకునడుగు మా పల్లెల ప్రేమలనే
జమ్మిచెట్టు ఆకునడుగు తెలంగాణ గెలుపునే
హుస్సెన్ సాగర్ అలలనడుగు జలదృశ్యపు ఆనవాల్లనే
బతుకమ్మ పూలనడుగు పూలలొ గౌరమ్మనడుగు
చెపుతాయిలె ఆడబిడ్డల మనసే అమ్మనాన్నల మమతే
మెరిసెబొట్ల బోనాన్నడుగు బోనంబెల్లబువ్వనడుగు
చెపుతాయిలే మా నమ్మకాలనే భక్తి విశ్వాసాన్నే
మక్కజొన్న కంకినడుగు మా కండల కరుకుదనం
సీతఫలం తీపినడుగు మాగుండెల బోళాతనాన్నే
మామిడికాయ తొక్కునడుగు మారోషపు ఘాటుతనం
తంగెడుపువ్వు రెమ్మనడుగు మా మనసుల మెత్తదనాన్నే
దుబాయ్ ఖలిఫా బురుజునడుగు చాటిచెప్పులే
మా చమట శక్తినే శ్రమ సౌందర్యాన్నే
ఆ ఇంద్రవెల్లి చెట్లనడుగు చూపుతాయిలె
గోండు రక్తపు యేరే పచ్చి గాయపుదారే
ఉస్మానియా గేటునడుగు చూపుని బుల్లెట్ల గాటులే
చార్మినారు మినార్‌నడుగు మినారులా నీడనడుగు
చెపుతాయిలే మా లౌకికత్వమే మదిలొ ప్రేమతత్వమే
భద్రాచలం గుడిని అడుగు గుడిలో ద్వజస్తంబాన్నడుగు
చూపుతాయిలే సీతమ్మ అడుగులే రామయ్య జాడలే
తెలంగాణ చెరువునడుగు చెరువుకట్ట చెట్టునడుగు
పిల్లపాప ముసలినడుగు ఉద్యమాల పాటపాడులే
సింగరేని బొగ్గునడుగు నడిరాతిరి చూపువెలుగు
సిరిసిల్ల మగ్గాన్నడుగు అగ్గిపెట్టెలొ చీరెనిచ్చులే
బైరాన్‌పల్లి బురుజునడుగు చూపుతుందిలే
రజాకారుదాడినే రైతాంగ పోరునే
ఆ మరతుపాకి తూటానడుగు చాటిచెప్పులే
మా తిరుగుబాటులే గెరెల్లా దాడులే
తెలంగాణ స్తూపాన్నడుగు విప్పిచెప్పు వీరుల కథలే

Song | ♦ | Orugallu Kotanadugu |
Singer(s) | ♦ | Jangi Reddy, Mangli |
Lyrics | ♦ | Kandikonda |
Music | ♦ | Nandan Bobbili |
Producer | ♦ | Appireddy |