Atha Koduka Muddula Marellaiah Song Lyrics





ఒయ్ అత్త కొడుకా ముద్దుల మారెల్లయ్య
మ్యాకలేడా మంద వెట్టినావురెల్లయ్య
మ్యాకలేడా మంద వెట్టినావు గొలయ్యా

ఆ పాలకుడిశా శెట్ల కింద నా మంద
పండుకోనీ నేమరెత్తాంది మల్లమ్మ
పండుకోనీ నేమరెత్తాంది గొల్లమ్మ

మన కల్లి మ్యకా బొల్లి మ్యాకలెల్లయ్య
కడుపునిండా మ్యాత తిన్నయారెల్లయ్య
కంటి నిండా నిదుర పొయ్నయా గొలయ్యా

మాలేసనే మేసినాయిగాని మల్లమ్మ
పయ్యమ్యాక సుడిదయ్యిందె మల్లమ్మ
ఇయ్యాల్నొరేపొ ఈనుతాదే గొల్లమ్మ

ఆ గంటు కాలా జ్యాల మ్యాకరెల్లయ్య
కుంటుతాండే ఎట్ల ఉన్నయీరెల్లయ్య
కురుకుతాండే మంచిగైనయా గొలయ్యా

అర్రె ఒద్ది శెక్కా మద్ది శెక్కా మల్లమ్మ
దంచికట్టినా మంచిగైనయే మల్లమ్మ
శెంగ శెంగా దునుకుతున్నయే గొల్లమ్మ

గా కర్రె గొంగడీ కిర్రుసెప్పులూ
ఎర్రంచు తెల్ల దోతిలోరెల్లయ్య
ఎంత ముద్దూగున్నవ్‍ర గొలయ్యా

ఆ గున్నాలూ గుండిపోగు సీరా
నీ గుండ్లు వోసినా గుత్తికట్టులా మల్లమ్మ
గువ్వలాలిలా జొన్నసేనువే గొల్లమ్మ

ఆ పరికి జిబ్బూ పరుపు బండాలు జర్ర
ఎక్కంగ దిగంగ పైలమోరెల్లయ్య
పాణమంతా నీ మీదనే గొలయ్యా

నువ్వు పాణమెత్తు నన్ను జూసుకొంగ మల్లమ్మ
నాకేమీ గాదులే ఓ మల్లమ్మ
నన్నెవ్వరూ ఏమీ జెయ్యరే గొల్లమ్మ

మన మ్యాక పైలం మంద పైలం
ఆ మంద గాసే నువ్వు పైలమోరెల్లయ్య
మల్లన్నకూ రోజు మొక్కుతా గొలయ్యా

ఆ మురవెల్లికీ పోయివద్దమే మల్లమ్మ
కోరమీసాలు పెట్టొద్దమే మల్లమ్మ
సట్టీ బోనాలు తీసోద్దమే గొల్లమ్మ


Atha Koduka Muddula Marellaiah Lyrics in Telugu. A beautiful village song about a couple showing love and care towards their goats. And this song also shows how they love and care for each other. I have typed these Telugu lyrics for people who want to learn and sing this song. Have a look at Telugu lyrics for Telangana Folk song Attha Koduka Muddhula Marellayya.

Song Atha Koduka Muddula Marellaiah
Singer(s)Shirisha, Gaddam Ramesh
Lyrics SV Mallik Teja
Music GL Namdev
Producer Gaddam Ramesh