ANADEMANANTINA Folk Song Lyrics



ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

నా మనసు మీద మన్ను
నా మనసు మీద మన్ను
మరిసెట్ల ఉందు నిన్ను

నిన్నాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

కాలేజి గేటు కాడా కంపౌండు దాటె కాడ
మూలమలుపు దిరిగె కాడ ముచ్చట్లు వెట్టిన గాని

ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

మా యింటి సందులోనా సమ్మక్క గద్దె కాడ
నన్నోంటిదాన్నిజూసి ఓరకంట సైగజేస్తె

నిన్నాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

మా ఆడకట్టులోన వరుసైన పోరగాండ్లు
నన్నేడిపించిరాని వురికచ్చి గొడతవుంటె

నిన్నాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

ఆనాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి

మొండోడివున్నవేంది మంకుపట్టు వదులవేంది
నన్నిడిసి వుండనోడా గడుసైన పొల్లగాడ

కోరి సెంత కొస్తివీ తిరుపతి
కాదంటె దూరముంటవా తిరుపతి

కోరి సెంత కొస్తివీ తిరుపతి
కాదంటె దూరముంటవా తిరుపతి

నువ్వంటె నాకు పిచ్చి మా యింటికి నువ్వొచ్చి
మా వోల్లను వోప్పిచ్చి మనువాడు కున్నవంటె

మల్లచ్చె యేటికల్లరో తిరుపతి
నా వొల్లె ఒక్క పిల్లరో తిరుపతి

మల్లచ్చె యేటికల్లరో తిరుపతి
నా వొల్లె ఒక్క పిల్లరో తిరుపతి

మన ప్రేమ గురుతులిస్తవా తిరుపతి
గుండెల్ల దాసుకుంటరో తిరుపతి

నా మనసు మీద మన్ను
నా మనసు మీద మన్ను
మరిసెట్ల ఉందు నిన్ను

నిన్నాడేమన్నంటినా తిరుపతి
నిన్నీనాడేమన్నంటినా తిరుపతి


Anademannantina song is published in 2019. In this song a girl is expressing her love for a guy named Tirupati, who has been trying to impress her. When she was crossing the college gate, he was waiting with friends to see her. Aanademannantinaa Tirupati means, Hey Tirupati did I ever oppose you when you are trying to impress me. We have provided this song lyrics in Telugu to be useful to the people who are trying to learn and sing this song.

Song Anademanantina
Singer(s)Laxmi
Lyrics Thirupathi Matla
Music Thirupathi Matla
Producer Sytv Team