Laagelaata Soodu Vadhine Song Lyrics



లాగెలున్న దొడ్లేకు పెండదియ్య వొమ్మంటె
లాగెలున్న దొడ్లేకు పెండదియ్య వొమ్మంటె
లాగేలాట అడుతాడు సూడు వదినే
లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే

ముసాలోడెగని కుశాలు వడుతడు
ముసాలోడెగని కుశాలు వడుతడు
ముద్దు లియ్యుమంటడు సూడు వదినే
ముసాలోడెగని కుశాలు వడుతడు

మొండి కర్రు వట్టుకోని సరిపియ్య వొమ్మంటె
మొండి కర్రు వట్టుకోని సరిపియ్య వొమ్మంటె
సిర్ర గోనెలాడుతాడు సూడు వదినే
మొండి కర్రు వట్టుకొని సరిపియ్య వొమ్మంటే

ముసాలోడెగని ఏశాలు వడుతడు
ముసాలోడెగని ఏశాలు వడుతడు
సీరెకొంగునిడువడు సూడు వదినే
ముసాలోడెగని ఏశాలు వడుతడు

సీకిపొయ్‍న కట్టేలు సెక్కలేసి రమ్మంటె
సీకిపొయ్‍న కట్టేలు సెక్కలేసి రమ్మంటె
సిందులాటలాడుతాడు సూడు వదినే
సీకిపొయ్‍న కట్టేలు సెక్కలేసి రమ్మంటే

ముసాలోడెగని మూసిముసి నవ్వుతాడు
ముసాలోడెగని మూసిముసి నవ్వుతాడు
రెక్కవట్టుకుంటాడు సూడు వదినే
మముసాలోడెగని మూసిముసి నవ్వుతాడూ

పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటె
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటె
సయ్యాటలాడుతాడు సూడు వదినే
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే

ముసాలోడెగని పడుసుబుద్ధి వోలేదు
ముసాలోడెగని పడుసుబుద్ధి వోలేదు
పకపక నవ్వుతాడు సూడు వదినే
మముసాలోడెగని పడుసుబుద్ధి వోలేదు

అంకాయ ఆలుగడ్డ బెండకాయ దొండకాయ
కూరగాయలమ్ముకచ్చి కూడబెట్టుకుందమంటె
కాయలాట ఆడుతాడు సూడు వదినే
కూరగాయలమ్ముకచ్చి కూడబెట్టుకుందమంటే

రేపటి రోజుకు కోల్యాగైతడ
రేపటి రోజుకు కోల్యాగైతడ
సీటీలు గొడుతడు సూడు వదినే
రేపటి రోజుకు కోల్యాగైతడా

సింత ముసలైనా పులుపు సావదట
సింత ముసలైనా పులుపు సావదట
సోకులవడుతాడు సూడు వదినే
సింత ముసలైనా పులుపు సావదట

ప్రేమకు వయసా మనసుకు ముసలా
మనసు ముసలిదా మరదాలా
ప్రేమకు వయసా మనసుకు ముసలా
నిత్య నూతనం మరదాలా
పచ్చతోరణమై మీరుండాలా
నిత్య నూతనం మరదాలా
పచ్చతోరణమై మీరుండాలా
నిత్య నూతనం మరదాలా
పచ్చతోరణమై మీరుండాలా


Lagelata song start with Lagelunna Dhodleku. This song is all about a naughty old husband. A wife tell all the crazy and naughty things which her husband does all the time. If she asks his to clean the cow shed, he goes there and plays with cows. We have provided the lyrics for this song to learn, sing and keep Telangana culture alive and shine bright the treditions. Lyagalata song published in 2021.

Song Laagelaata Soodu Vadhine
Singer(s)Lavanya
Lyrics Parshuram Nagam
Music GL Namdev
Producer MANAIR MUSIC & MOVIES