Chikkudu Akulla Uyyalo - Bathukamma Song Lyrics


👉 Lyrics in Telugu

👉 Lyrics in English


Chikkudu Akulla Uyyalo Song Lyrics in English:


Chikkudu akullo uyyalo
Saddhulu kattukoni uyyalo || 2 ||

Siripuram nenu bothi uyyalo
Chuttala jooda uyyalo || 2 ||

Akkadevarunnaru uyyalo
Ambo yathakshi uyyalo || 2 ||

Makunu maa vallu uyyalo
Maa annadhammulu uyyalo || 2 ||

Mamuganna thandriki uyyalo
Bavalu mardhulu uyyalo || 2 ||

Bava mardhulu goodi uyyalo
Bavi dhodinchiru uyyalo || 2 ||

Bavilo unnadhi uyyalo
Bangaru bindhe uyyalo || 2 ||

Bindhela unnadhi uyyalo
Veeranna shava uyyalo || 2 ||

Shavala unnadhi uyyalo
Sannapu manchamu uyyalo || 2 ||

Manchamla vadukunna uyyalo
Jana bethadu vadhina uyyalo || 2 ||

Kobbari dhinnadhi uyyalo
Dabbuna vannadhi uyyalo || 2 ||

Kobbari kudukalla uyyalo
Kotti leparayya uyyalo || 2 ||

Kottina levadhe uyyalo
Kalavari bidda uyyalo || 2 ||

Dhoddu dhoddu muthyalu uyyalo
Dhulipee lepandi uyyalo || 2 ||

Sanna sanna muthyalu uyyalo
Salli lepandamma uyyalo || 2 ||

Pagadalu pachalu uyyalo
Posi lepandamma uyyalo || 2 ||

Yimpaina rathnalu uyyalo
Visiri lepandamma uyyalo || 2 ||

Yenthaku levadhu uyyalo
Kalavari bidda uyyalo || 2 ||

Athalu pilichina uyyalo
Uluku paluku ledhu uyyalo || 2 ||

Yarandlu pilichina uyyalo
Maa vadhine medhalale uyyalo || 2 ||

Panivallu pilichina uyyalo
Kandlu dhevaraledhu uyyalo || 2 ||

Yemi nidhuranamma uyyalo
Yintha jamu dhaka uyyalo || 2 ||

Anna ro mayanna uyyalo
Maa peddhanna uyyalo || 2 ||

Kachiri dhigivachi uyyalo
Yillu jerindamma uyyalo || 2 ||

Kallu chethulu kadaga uyyalo
Chembu neeta munche uyyalo || 2 ||

Aa sappudinnadhi uyyalo
Vannela maa vadhine uyyalo || 2 ||

Dhigguna lechindhi uyyalo
Pakkuna navvindhi uyyalo || 2 ||

Dhigguna lechindhi uyyalo
Pakkuna navvindhi uyyalo || 2 ||

Dhigguna lechindhi uyyalo
Pakkuna navvindhi uyyalo || 2 ||


Chikkudu Akulla Uyyalo Song Lyrics in Telugu:


చిక్కుడు ఆకుల్ల ఉయ్యాలో
సద్దులు గట్టుకొని ఉయ్యాలో || 2 ||

సిరిపురం నేనుబోతి ఉయ్యాలో
చుట్టాల జూడ ఉయ్యాలో || 2 ||

అక్కడెవరున్నారు ఉయ్యాలో
అంభోయాతాక్షి ఉయ్యాలో || 2 ||

మాకును మావాళ్లు ఉయ్యాలో
మా అన్నదమ్ములు ఉయ్యాలో || 2 ||

మముగన్న తండ్రికి ఉయ్యాలో
బావలు మరుదులు ఉయ్యాలో || 2 ||

బావమరుదులు కూడి ఉయ్యాలో
బావి తోడించిరి ఉయ్యాలో || 2 ||

బావిలో ఉన్నాది ఉయ్యాలో
బంగారు బిందె ఉయ్యాలో || 2 ||

బిందెలో ఉన్నది ఉయ్యాలో
వీరన్న శావ ఉయ్యాలో || 2 ||

శావలో ఉన్నది ఉయ్యాలో
సన్నపు మంచము ఉయ్యాలో || 2 ||

మంచంలో పడుకున్న ఉయ్యాలో
జాన బెత్తెడు వదిన ఉయ్యాలో || 2 ||

కొబ్బరి తిన్నది ఉయ్యాలో
దబ్బున పన్నది ఉయ్యాలో || 2 ||

కొబ్బరి కుడుకల్ల ఉయ్యాలో
కొట్టి లేపరయ్య ఉయ్యాలో || 2 ||

కొట్టిన లేవదే ఉయ్యాలో
కలవారి బిడ్డ ఉయ్యాలో || 2 ||

దొడ్డు దొడ్డు ముత్యాలు ఉయ్యాలో
దులిపీ లేపండి ఉయ్యాలో || 2 ||

సన్న సన్న ముత్యాలు ఉయ్యాలో
సల్లి లేపండమ్మ ఉయ్యాలో || 2 ||

పగడాలు, పచ్చలు ఉయ్యాలో
పోసి లేపండమ్మ ఉయ్యాలో || 2 ||

ఇంపైన రత్నాలు ఉయ్యాలో
విసిరి లేపండమ్మ ఉయ్యాలో || 2 ||

ఎంతకూ లేవదూ ఉయ్యాలో
కలవారి బిడ్డ ఉయ్యాలో || 2 ||

అత్తలు పిలిచిన ఉయ్యాలో
ఉలుకు పలుకు లేదు ఉయ్యాలో || 2 ||

యారాండ్లు పిలిచినా ఉయ్యాలో
మా వదిన మెదలలె ఉయ్యాలో || 2 ||

పని వాళ్లు పిలిచిన ఉయ్యాలో
కండ్లు తెరవలేదు ఉయ్యాలో || 2 ||

ఏమి నిద్రనమ్మ ఉయ్యాలో
ఇంత జాము దాక ఉయ్యాలో || 2 ||

అన్నరో మాయన్న ఉయ్యాలో
మా పెద్దన్న ఉయ్యాలో || 2 ||

కచ్చీరి దిగివచ్చి ఉయ్యాలో
ఇల్లు జేరిండమ్మ ఉయ్యాలో || 2 ||

కాళ్లు చేతులు కడగ ఉయ్యాలో
చెంబు నీట ముంచె ఉయ్యాలో || 2 ||

ఆ సప్పుడిన్నది ఉయ్యాలో
వన్నెల మా వదిన ఉయ్యాలో || 2 ||

దిగ్గున లేచింది ఉయ్యాలో
పక్కున నవ్వింది ఉయ్యాలో || 2 ||

దిగ్గున లేచింది ఉయ్యాలో
పక్కున నవ్వింది ఉయ్యాలో || 2 ||

దిగ్గున లేచింది ఉయ్యాలో
పక్కున నవ్వింది ఉయ్యాలో || 2 ||

Song source Telangana Jagruthi & Amulya Audios and Videos







tags: "Telugu Songs Lyrics", "Bathukamma Songs Lyrics", "Telangana Folk Songs Lyrics", "Telugu Folk Songs Lyrics", "Bathukamma Festival Song Lyrics", "Bathukamma Treditional Song", "Chikkudu Akulla song lyrics", "Sikkudu Akulla Song Lyrics", "Sikkudu Akulla Uyyalo Song Lyrics"

Copyright Information
● Please note that we do not own the lyrics; all rights are reserved to the respected owners of the songs. We simply provide the lyrics for learning and singing purposes. We are providing the video link and the channel link to give credit to the creators.
● If you think we have broken your copyrights, we will take them down. Please contact us via email at lyricslokam@gmail.com.